AP Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: AP Local Body Elections | ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన గడువులోపు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ఎస్‌ఈసీ ఇప్పటికే సిద్ధమైంది. అయితే నోటిఫికేషన్ విడుదలలోపు ఎస్​ఐఆర్​ ప్రక్రియ పూర్తయితే ఆ జాబితా తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఒకవేళ ‘సర్’ ప్రక్రియ పూర్తికాకపోతే పాత జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

AP Local Body Elections | బీసీ రిజర్వేషన్ల పిటిషన్​ కొట్టివేత..

ఇక స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 34 శాతం కోటా కారణంగా రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నాయని.. రాష్ట్ర సర్కారు జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు ఇటీవల కొట్టేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తలుపుతట్టింది. విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.

ఇది కూడా చదవండి..: AP AI GST Model | ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *