అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Additional Collector | నిజామాబాద్ (Nizamabad) జిల్లా అదనపు కలెక్టర్‌గా (రెవెన్యూ) రాజాగౌడ్ (Additional Collector Rajagoud) బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌కు చేరుకోగా అధికారులు స్వాగతం పలికారు.
Nizamabad Additional Collector | అదనపు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా..
అంతకుముందు ఆయన మర్యాదపూర్వకంగా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిశారు. స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్వో గీత, కలెక్టరేట్ ఏవో బాలరాజు, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టక్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అదనపు కలెక్టర్‌గా కొనసాగిన ఎస్.కిరణ్ కుమార్ పదవీ విరమణ చేయగా, ఆయన స్థానంలో జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా కొనసాగుతున్న రాజాగౌడ్‌ను జిల్లాకు బదిలీ చేశారు. కాగా.. అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ఇదివరకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడ, బోధన్, ఆర్మూర్‌లలో ఆర్డీవోగా విధులు నిర్వర్తించారు.
ఇది కూడా చదవండి: సూర్యుడిపై భారీ పేలుడు.. భూమికి సోలార్ తుఫాను ముప్పుందా?