అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Paddy Purchase | నిజామాబాద్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సంఘం అధ్యక్షుడు కొట్టాల రవీందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీపీసీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
Nizamabad Paddy Purchase | సమన్వయంతో పనిచేయాలి
ఈ కేంద్రం ద్వారా రైతులకు ధాన్యం విక్రయించేందుకు సౌకర్యం కల్పించనున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు రైతులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు నీలకంఠి నీలిమ, ఉప్పులపు సంతోష్ రెడ్డి, రైతు నాయకుడు ఆకుల పాపయ్య, ఏఈవో చక్రపాణి, సంఘ కార్యదర్శి పి. వంశీకృష్ణ, రైతులు, నాయకులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.