అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Narala Sudhakar Red Cross | నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో మేనేజింగ్ కమిటీ మెంబర్ నరాల సుధాకర్ విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మర్యాదపూర్వకంగా సినీ నిర్మాతలైన దిల్ రాజు(Dil Raju), శిరీష్ రెడ్డిలను హైదరాబాద్‌లో(hyderabad) కలిశారు.
Narala Sudhakar Red Cross | భవిష్యత్తులో మరిన్ని విజయాలు..
ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ ఎన్నికల్లో విజయం సాధించిన నరాల సుధాకర్‌ను దిల్ రాజు, శిరీష్ రెడ్డిలు అభినందించారు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం నరాల సుధాకర్ మాట్లాడుతూ.. తనని ఒక కుటుంబ సభ్యులుగా భావిస్తున్న దిల్ రాజు, శిరీష్ రెడ్డి, వారి కుటుంబసభ్యులకు సదా రుణపడి ఉంటానన్నారు. మరింత ఉత్సాహంతో రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొంటానని నరాల సుధాకర్ అన్నారు.
ఇది కూడా చదవండి: అభిజీత్ దీప్కేను నిలదీసిన ప్రజలు