అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India vs West Indies | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 14న భారత్–వెస్టిండీస్ నాలుగో టీ 20 మ్యాచ్ జరగనుంది. మూడో టీ 20 రేపు ఇండోర్‌లో నిర్వహించనున్నారు.
ఉప్పల్‌లో మ్యాచ్ కోసం హెచ్‌సీఏ ఏర్పాట్లు చేసింది. క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఆర్మీ సిబ్బందికి 2,750 ఉచిత టిక్కెట్లను అందిస్తామని తెలిపింది. విద్యార్థులకు 2,500 టిక్కెట్లు, ఆర్మీ సిబ్బందికి 250 టిక్కెట్లు ఉచితంగా ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్ కోసం మొత్తం 34 వేల టికెట్లను అందుబాటులో ఉంచారు. టికెట్లను ఆన్లైన్లో విక్రయించారు. టికెట్ ధర రూ.750 నుంచి ప్రారంభం అవుతుంది.
India vs West Indies | పార్కింగ్ కష్టాలకు చెక్
ఉప్పల్ స్టేడియంలో పార్కింగ్ కష్టాలకు హెచ్‌సీఏ చెక్ పెట్టింది. మ్యాచ్ చూడటానికి వచ్చే వారి కోసం పార్కింగ్ సామర్థ్యాన్ని పెంచింది. దీంతో 4500 కార్లు ఇప్పుడు పార్క్ చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరగనున్న T20 మ్యాచ్ కోసం కొత్త పిచ్‌ను సైతం సిద్ధం చేశారు. ఉప్పల్ స్టేడియంలో 15 ఏళ్ల తర్వాత కొత్త పిచ్ ఏర్పాటు చేయడం గమనార్హం.
ఇది కూడా చదవండి..: Kisan Cricket League | గ్రామీణ ప్రతిభకు పెద్దపీట.. ప్రసార భారతితో కలిసి ‘కిసాన్ క్రికెట్ లీగ్’ గ్రాండ్ లాంచ్