Jyotirao Phule Jayanti | రాజేంద్రనగర్‌లో ఫూలే 200వ జయంతి ఉత్సవాలకు సన్నాహాలు

నవంబర్‌ 26న ఉత్సవ సభ నిర్వహణకు ప్రాథమిక నిర్ణయం.. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jyotirao Phule Jayanti | మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి ఉత్సవాల నిర్వహణపై చర్చించేందుకు హైదరాబాద్​ రాజేంద్రనగర్‌లోని అంబేడ్కర్ నగర్​లో ఉన్న అంబేడ్కర్ సంఘం భవన్‌లో స్థానిక నాయకులు, మేధావులు, సామాజిక కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఫూలే–అంబేడ్కర్ ఆలోచనా సమితి (PAAS) అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.ఏ. మాలిక్, మదనం గంగాధర్ పాల్గొని ఉత్సవాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, ఫూలే–అంబేడ్కర్ భావజాల ప్రచారం తదితర అంశాలపై చర్చించారు.

ఈ సమావేశంలో రాజు, యాదయ్య, సురేష్, శ్యామ్ రాజ్, జగన్మోహన్, పవన్ కుమార్, సంజీవ్, పెంటయ్య, రవీందర్, రమేష్, బాబూరావు, షేక్ అక్బర్, నాగేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

akshara today .jpgpaas 1

Jyotirao Phule Jayanti | నవంబర్ 26న సభ..

సమావేశంలో జరిగిన చర్చల అనంతరం 2026 నవంబర్ 26న రాజేంద్రనగర్‌లో ఫూలే జయంతి ఉత్సవాల సభ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ సభకు ఫూలే–అంబేడ్కర్ భావజాలంపై కృషి చేస్తున్న ప్రముఖ మేధావులు, సామాజిక ఉద్యమకారులు, విద్యావేత్తలను వక్తలుగా ఆహ్వానించాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమాన్ని ఫూలే–అంబేడ్కర్ ఆలోచనా సమితి (PAAS), తెలంగాణ డిగ్రీ కళాశాల బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ (TDBCLA) సంయుక్తంగా నిర్వహించనున్నాయి.

Jyotirao Phule Jayanti | పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం..

మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో విద్యా వ్యాప్తి, కుల వివక్ష నిర్మూలన, మహిళా విద్య, సమానత్వం కోసం చేసిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ప్రతిపాదించిన సామాజిక న్యాయం, ప్రజాస్వామిక విలువలు, మానవ గౌరవం వంటి ఆశయాలను విస్తృతంగా ప్రచారం చేయడానికి ఈ ఉత్సవాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

ఈ సమావేశం ద్వారా ఉత్సవాల నిర్వహణకు ప్రాథమిక కార్యాచరణ ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో వక్తలకు ఆహ్వానాలు, ఇతర ఏర్పాట్లపై తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

akshara today .jpgpaas 3

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *