అక్షరటుడే, వెబ్‌డెస్క్: May 01 Gold Rates | బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. గతంలో వరుసగా పెరుగుతూ వచ్చిన ఈ విలువైన లోహాల ధరలు ఇప్పుడు గణనీయంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా గత రెండు మూడు రోజులుగా ధరలు పడిపోతుండటంతో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభిస్తోంది.
దేశీయ మార్కెట్లో మే 1న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,670 వద్ద నమోదైంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,110 కాగా, 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,000గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కిలో వెండి ధర Silver Price Kerala రూ.2,49,000 వద్ద ట్రేడవుతోంది.
May 01 Gold Rates | ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, కేరళ వంటి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,670గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,110గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,50,820, 22 క్యారెట్ల ధర రూ.1,38,260గా ఉంది. చెన్నైలో మాత్రం ధరలు మరింత ఎక్కువగా ఉండి 24 క్యారెట్ల బంగారం రూ.1,53,830, 22 క్యారెట్ల బంగారం రూ.1,41,010 వద్ద కొనసాగుతోంది.
వెండి విషయానికొస్తే హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో ధర రూ.2,70,000గా ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో రూ.2,49,900 వద్ద ఉంది.
May 01 Gold Rates | డాలర్ బలపడటం
స్టాక్ మార్కెట్లో లాభాల స్వీకరణ (Profit Booking) పెరగడం, ముడి చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ ఆందోళనలు మళ్లీ ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం నుంచి కొంతమేర వెనక్కి తగ్గుతున్నారు. మరోవైపు అమెరికా డాలర్ బలపడటం కూడా బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతోంది.
అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరిని కొనసాగించే అవకాశాలు ఉండటం, అంతర్జాతీయంగా అమెరికా–ఇరాన్ మధ్య ఉన్న అనిశ్చితి పరిస్థితులు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
ప్రస్తుతం కనిపిస్తున్న ధరలు ప్రాథమిక మార్కెట్ రేట్లు మాత్రమే. బంగారం లేదా వెండి కొనుగోలు చేసే సమయంలో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు Making Charges మరియు ఇతర పన్నులు అదనంగా వర్తిస్తాయి.
అలాగే నగరాల వారీగా స్థానిక జ్యువెలరీ అసోసియేషన్ల నిర్ణయాల ప్రకారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ధరలు తగ్గుతున్న ఈ సమయంలో కొనుగోలుదారులు సరైన సమయాన్ని ఉపయోగించుకుంటే లాభపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
Mother Son SSC Success | ఒకేసారి పదో తరగతి పరీక్షల్లో పాస్ అయిన తల్లి, కొడుకు

