హైదరాబాద్Software Engineer Suicide | "నమ్మకమే శాపమైంది".. భార్య అక్రమ సంబంధం తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్...

Software Engineer Suicide | “నమ్మకమే శాపమైంది”.. భార్య అక్రమ సంబంధం తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణం!

"నెలకు రెండు లక్షల రూపాయల సంపాదన.. అపురూపంగా చూసుకునే భర్త.. ఇద్దరు ముద్దుల బిడ్డలు.. అందమైన సంసారం.. ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలి?..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Software Engineer Suicide | “నెలకు రెండు లక్షల రూపాయల సంపాదన.. అపురూపంగా చూసుకునే భర్త.. ఇద్దరు ముద్దుల బిడ్డలు.. అందమైన సంసారం.. ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలి?..

కానీ, కట్టుకున్న భార్య కన్నతల్లిలా ఉండాల్సిన చోట, కామంతో కళ్లు మూసుకుపోయి ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకుంటే.. ఆ నిజాన్ని భరించడం ఏ భర్తకైనా సాధ్యమేనా?” – ఇదీ ఆత్మహత్యకు ముందు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం మనసులో మెదిలిన ఆవేదన.

గత ఫిబ్రవరిలో హైదరాబాద్‌ (Hyderabad)లోని హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం కేసులో తాజాగా వెలుగులోకి వచ్చిన వాస్తవాలు సమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి. చనిపోయే ముందు సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తోంది.

Software Engineer Suicide | నమ్మకద్రోహం:

ఏపీలోని మార్కాపురానికి (Markapuram) చెందిన సీతారాంకు, నంద్యాలకు చెందిన రేణుకతో 2018లో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, భర్తను కాదని రేణుక ముగ్గురు వ్యక్తులతో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు సీతారాం లేఖలో ఆరోపించారు.

నిస్సహాయత: తన భార్య మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ వీడియోలు బయటపడటంతో సీతారాం కుప్పకూలిపోయారు. ఆ వీడియోలను ఆమె ప్రియుడు రమణా రెడ్డి సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేయడంతో, అది చూసి తన భార్య అక్రమ బాగోతం తెలుసుకుని తట్టుకోలేకపోయారు.

బెదిరింపులు: భార్య తప్పును సరిదిద్దాలని ప్రయత్నిస్తే, తిరిగి ఆమె ఆత్మహత్య చేసుకుంటానని తననే బెదిరించిందని, ఎంత చెప్పినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని సీతారాం లేఖలో వాపోయారు.

చివరి మాట: “ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా భార్యను గుడ్డిగా నమ్మడమే నేను చేసిన తప్పు” అని సీతారాం రాసిన మాటలు అక్షర సత్యాలై నిలిచాయి.

Software Engineer Suicide | పోలీసుల దర్యాప్తు:

సీతారాం రాసిన మరణ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రేణుకతో సంబంధం ఉన్న రమణా రెడ్డి, శ్రవణ్‌లను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సీతారాం తల్లిదండ్రుల నుంచి కూడా స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసినట్లు సమాచారం.

ఒక ఉన్నత విద్యావంతుడు, సమాజంలో మంచి హోదాలో ఉన్న వ్యక్తి, భార్య చేసిన నమ్మకద్రోహం వల్ల ప్రాణాలు తీసుకోవడం కుటుంబ వ్యవస్థలోని విచ్ఛిన్నతకు అద్దం పడుతోంది.

ఇది కూడా చదవండి..: TIMS Sanathnagar Trial | సమస్త వైద్య సేవల సమాహారం టిమ్స్​.. ఈ వైద్యాలయ ప్రత్యేకతలు ఎన్నో.. నేటి నుంచి ఓపీ! 

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

GST Collections | రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్: GST Collections | దేశంలో జీఎస్టీ వసూళ్లు రికార్డు...

CV Anand DGP | రాష్ట్ర డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ

అక్షరటుడే, హైదరాబాద్: CV Anand DGP | తెలంగాణ రాష్ట్ర పోలీస్...

Pawan Khera Bail | కాంగ్రెస్​ నాయకుడు పవన్​ ఖేరాకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pawan Khera Bail | కాంగ్రెస్ నాయకుడు పవన్...