అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Bathukamma Celebrations | నగరంలోని నిషితా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నిషితా ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు, దాండియా ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ ఆడారు.
Bathukamma Celebrations | విద్యార్థుల్లో ఐకమత్యం..
నగర మేయర్ ఉమారాణి ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఐకమత్యం, సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. బతుకమ్మ విశిష్టతను వివరించారు. మేయర్ ఉమారాణి మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. పాఠశాల నిర్వాహకులు వినయ్ కుమార్, ఛైర్మన్ నిఖిల్, డైరెక్టర్ పూజ, కో ఆర్డినేటర్ రాజు, ప్రిన్సిపల్ దియా బెనర్జీ పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Mobile Theft Arrest | రైల్వేస్టేషన్ ఆవరణలో మొబైల్ చోరీ నిందితుడి అరెస్ట్..