Ponguleti Srinivas Reddy | ప్రజలను అణచివేస్తున్న బీజేపీ, బీఆర్​ఎస్​ : పొంగులేటి

కేంద్ర ప్రభుత్వం ప్రజలను అణచి వేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ponguleti Srinivas Reddy | ప్రజలను అణచివేయడంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా పోస్ట్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ (Dehli)లోని జంతర్​ మంతర్​ను నిరసన తెలిపే జాబితా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై పొంగులేటి స్పందించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ లాగే, కేంద్రంలో బీజేపీని కూడా ప్రజలు బొందపెడుతారన్నారు. మొన్న పేపర్ లీక్స్… నిన్న ప్రజల నిరసన హక్కును హరించడం… ప్రజా వ్యతిరేక చర్యల్లో బీజేపీ తన బీ-టీం బీఆర్ఎస్‌నే అనుసరిస్తోందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్‌లో నిరసనలను నిషేధించిన బీఆర్​ఎస్​ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.

Ponguleti Srinivas Reddy | పోరాటం ఆగదు

ఓటు చోరీకి వ్యతిరేకంగా దేశమంతా నిరసన గళం వినిపిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలకు వేదికైన జంతర్ మంతర్‌ను నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించడం సరికాదన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణికి నిదర్శనమన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల సాధన కోసం సాగుతున్న పోరాటం ఆగదన్నారు.

ఇది కూడా చదవండి..: Jantar Mantar Protest | జంతర్​మంతర్​ వద్ద ఆందోళన.. సీజేపీ నాయకుల అరెస్ట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *