అక్షరటుడే, ఇందూరు: Nizamabad Urban Development | అర్బన్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ స్పష్టం చేశారు. నగరంలోని 50, 7, 20వ డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు.
Nizamabad Urban Development | ప్రతి డివిజన్‌కు రూ.20లక్షలు
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన కార్పొరేషన్ కౌన్సిల్లో ప్రతి డివిజన్‌కు రూ.20లక్షల నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో అన్ని డివిజన్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తామని తెలిపారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ కోసం కూడా ఇప్పటికి అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానన్నారు. తొందర్లోనే డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని పేర్కొన్నారు. అలాగే డివిజన్‌కు రూ. కోటి పనులు కూడా కొన్ని డివిజన్లో ప్రారంభమయ్యాయని, మరికొన్ని ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు.
Nizamabad Urban Development | అమృత్–2 పథకం కింద..
అమృత్–2 పథకం కింద నగరంలో యూజీడీ పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నగరంలో నూతనంగా 9 వాటర్ ట్యాంకుల నిర్మాణం జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నీటి ఎద్దడి లేకుండా పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అలాగే ఇందూరులోనే ఘన చరిత్ర ఉన్న అతి పురాతనమైన ఖిల్లా రామాలయ అభివృద్ధిలో భాగంగా రోప్‌వే కూడా రాబోతుందన్నారు. కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి, 50వ డివిజన్ కార్పొరేటర్ జగదీష్ కులకర్ణి, 7వ డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్, 20వ డివిజన కార్పొరేటర్ న్యాలం సునీత, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Krait Snake Bite | కట్లపాము కాటుకు గురైన బాలుడికి జీజీహెచ్‌లో అరుదైన చికిత్స