అక్షరటుడే, వెబ్డెస్క్: Samakhya 2026 | రాష్ట్రంలో పెట్టుబడులకు లాభదాయక వాతావరణం, భరోసా, అనుమతులు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. పారిశ్రామికవేత్తలు తమ ప్రతిపాదనలతో ముందుకు రావాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలోని హైటెక్స్లో సమాఖ్య –2026 గ్లోబల్ బిజినెస్ మీట్లో సీఎం మాట్లాడారు. పెట్టుబడల ప్రతిపాదనలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన మంచి పారిశ్రామిక విధానాలను కొనసాగిస్తున్నామని, గత 30 ఏళ్లుగా పెట్టుబడిదారులకు సంబంధించిన విధానాల్లో మార్పులు చేయలేదని పేర్కొన్నారు.
Samakhya 2026 | ప్రపంచ స్థాయి నగరంగా..
హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి ప్రపంచస్థాయి నగరాలతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు వచ్చినా దేశానికే మేలు జరుగుతుందని, పెట్టుబడులతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. తాము ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తామని, మిగతా సమయంలో అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంతో దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రాల సహకారం అవసరమని నొక్కి చెప్పారు.
Samakhya 2026 | మహిళలను ప్రోత్సహించాలి
మహిళల భాగస్వామ్యం ఉన్న దేశాలే అత్యధికంగా ఆర్థికంగా బలపడ్డాయని రేవంత్రెడ్డి అన్నారు. ఆర్థికంగా ఎదిగిన దేశాల్లో 50 శాతానికి పైగా భాగస్వామ్యం మహిళలదే ఉందని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇది కూడా చదవండి..: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదనంగా కేంద్రం నిధులు.. ఎవరెవరికి దక్కుతుందంటే?