Nizamabad Development Fund | అభివృద్ధి కోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలి..: ఎమ్మెల్యే ధన్​పాల్​

నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫండ్ ఇవ్వాలని, ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Development Fund | నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫండ్ ఇవ్వాలని, ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని 26వ డివిజన్​లో చేపట్టే రోడ్డు పనులకు భూమి పూజ చేశారు.

Nizamabad Development Fund | డివిజన్​కు రూ.20లక్షలు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ఏడాది కార్పొరేషన్​లో పాలక వర్గం లేకపోవడం, కౌన్సిల్ సమావేశం జరగకపోవడంతో నిధులు లేవన్నారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్​కు రూ. 20 లక్షలు కేటాయించారన్నారు. వీటితో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు అలాగే ప్రతి డివిజన్​కు రూ.కోటి పనులు కూడా ప్రారంభమవుతున్నాయని తెలిపారు. అర్బన్ చాలెంజ్ ఫండ్, ఖిల్లా రామాలయంలో రోప్ వేకు డీపీఆర్ కూడా సిద్ధమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి, కార్పొరేటర్ బంటు రాము, బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: SRSP Water Release | ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా నీటి విడుదల

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *