అక్షరటుడే వెబ్డెస్క్: Ai+ Smartphone Customer Feedback | వినియోగదారుల అవసరాలు, అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ Ai+ స్మార్ట్ఫోన్ ( Smartphone )బ్రాండ్ తన కస్టమర్-కేంద్రీకృత విధానాన్ని మరింత బలోపేతం చేస్తోంది. కేవలం ఫోన్లను విక్రయించడమే కాకుండా, కస్టమర్ల నుండి లభించే ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రాడక్ట్ డిజైన్, సాఫ్ట్వేర్ అప్డేట్లు , కస్టమర్ సపోర్ట్ను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తోంది.
Ai+ Smartphone Customer Feedback | విశేష ఆదరణ..
Ai+ అందిస్తున్న వివిధ స్మార్ట్ఫోన్ మోడళ్లకు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా Nova 2 Neo 5G బ్యాటరీ పనితీరుకు, Nova 2 Power 5G డ్యూయల్-టోన్ డిజైన్ , బ్లూ ఫ్యూజన్ రంగుకు మంచి ప్రశంసలు అందుకున్నాయి. అలాగే Nova 2 Ultra 5G ఫోటోగ్రఫీ సామర్థ్యాలు, AMOLED డిస్ప్లేతో ఆకట్టుకోగా.. Nova 2 5G, Pro 5G మోడళ్లు ధరకు తగిన విలువను అందిస్తూ, Ai+ Pulse 2 తన బ్యాటరీ, డిస్ప్లేతో కస్టమర్లను మెప్పించాయి.
Ai+ Smartphone Customer Feedback |శాశ్వత పరిష్కారాలు..
సానుకూల అంశాలతో పాటు కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదులు, సలహాలను కూడా బ్రాండ్ సీరియస్గా తీసుకుంటోంది. కెమెరా స్టెబిలిటీ, నెట్వర్క్ కనెక్టివిటీ, స్పీడ్ సమస్యలపై ఆర్ అండ్ డీ బృందాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఇప్పటికే Nova 2 Ultra 5G ఫోన్కు కెమెరా పనితీరును మెరుగుపరిచేందుకు ప్రత్యేక OTA సాఫ్ట్వేర్ అప్డేట్లను అందించడం జరిగింది. భవిష్యత్తులో రాబోయే కొత్త మోడళ్ల తయారీలో కూడా ఈ అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
సంపూర్ణ పారదర్శకత..
కస్టమర్లకు ఫోన్ చేరడానికి ముందే స్వతంత్ర మూల్యాంకనం కోసం ‘ప్రాజెక్ట్ ఓపెన్ రివ్యూ’ను బ్రాండ్ ప్రారంభించింది. ఇప్పటివరకు రివ్యూయర్లు, క్రియేటర్లు, టెక్ నిపుణులు , ఎథికల్ హ్యాకర్ల నుంచి వెయ్యికి పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఫోన్ లాంచ్ కావడానికి ముందే నిష్పాక్షికమైన అభిప్రాయాలను సేకరించి, అవసరమైన మార్పులు చేయడానికి ఈ ప్రోగ్రామ్ దోహదపడుతోంది.
Ai+ Smartphone Customer Feedback | వేగవంతమైన ఆఫ్టర్ సేల్స్ సర్వీస్..
విక్రయాల అనంతర సేవలను మరింత వేగవంతం చేసేందుకు Ai+ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్లు, కామెంట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కస్టమర్ కేర్ బృందంతో సమన్వయం చేస్తున్నారు. సర్వీస్ సంబంధిత సమస్యలను 3 నుండి 4 రోజుల్లో పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకోగా, స్పేర్ పార్ట్స్ లభ్యత ఆలస్యమయ్యే చోట కస్టమర్ల ఇబ్బందిని తగ్గించడానికి అవసరమైన రీప్లేస్మెంట్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు.
నిపుణుల మాట..
ఈ విధానంపై Ai+ స్మార్ట్ఫోన్ బ్రాండ్, మార్కెటింగ్ & గ్రోత్ హెడ్ ఆర్చి గొగోయ్ మాట్లాడుతూ.. మెరుగైన సాంకేతికతను నిర్మించడం అంటే వినియోగదారుల మాట వినడంతోనే మొదలవుతుందని తెలిపారు. కస్టమర్ల అభిప్రాయాలు తాము ఎక్కడ మెరుగుపడాలో అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని, సాఫ్ట్వేర్ అప్డేట్లు , వేగవంతమైన సపోర్ట్ ద్వారా వారి అనుభవాన్ని మరింత ఉన్నతంగా మార్చడమే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ACB Trap | 22-ఏ భూమి కోసం రూ.5 లక్షల లంచం డిమాండ్