తెలంగాణKTR on Gas Prices | మోదీపై కేటీఆర్​ ఫైర్​.. గ్యాస్​ ధరలు తగ్గించాలని డిమాండ్​

KTR on Gas Prices | మోదీపై కేటీఆర్​ ఫైర్​.. గ్యాస్​ ధరలు తగ్గించాలని డిమాండ్​

మోదీపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్​లో ఎన్నికలు ముగియగానే దేశవ్యాప్తంగా సిలిండర్​ ధరలను పెంచారని మండిపడ్డారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR on Gas Prices | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)పై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్​లో ఎన్నికలు ముగియగానే దేశవ్యాప్తంగా కమర్షియల్​ సిలిండర్​ ధరలను భారీగా పెంచారని మండి పడ్డారు.

తెలంగాణ భవన్​ (Telangana Bhavan)లో శుక్రవారం మే డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్​ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడు పెంచనంతగా వాణిజ్య సిలిండర్ల మీద రూ.993 పెంచిన ఘనత మోదీది అని విమర్శించారు. ఎన్నికలు అయిపోగానే గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచడం మోదీకి అలవాటు అయిందన్నారు. ఒక్క సిలిండర్ మీద దాదాపు రూ.వెయ్యి పెంచి సామాన్యులకు, హోటళ్లలో పని చేసే కార్మికులకు మోదీ మేడే కానుక ఇచ్చారని ఎద్దేవా చేశారు.

KTR on Gas Prices | తీవ్ర ప్రభావం

హైదరాబాద్‌ (Hyderabad)లో నిన్నటి వరకు ఒక సిలిండర్ ధర రూ.2,321 ఉండగా ఈరోజు నుంచి రూ.3,315కు చేరిందని కేటీఆర్​ అన్నారు. వాణిజ్య సిలిండర్ల ధరల పెరుగుదల ప్రభావం హోటళ్ల మీద, మెస్‌ల మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​ నగరంలో యువతకు, ఉద్యోగాలు చేసుకునే వారికి ఈ ధరల పెంపు వల్ల ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.

KTR on Gas Prices | కార్మికుల సంక్షేమం పట్టని ప్రభుత్వాలు

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని కేటీఆర్​ విమర్శించారు. మోదీ పాలనలో రూపాయి విలువ పాతాళానికి, గ్యాస్​ ధరలు ఆకాశానికి చేరుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government)  కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ముందు కార్మికులకు అనేక హామీలు ఇచ్చిన రేవంత్​రెడ్డి ఇప్పుడు వారిని విస్మరించారన్నారు.

KTR on Gas Prices | రెండేళ్లలో కేసీఆర్​ వస్తారు

రేవంత్​ రెడ్డి (Revanth Reddy) ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మొద్దునిద్ర పోతున్నారని కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మరణించిన కార్మికులకు ఇంకా పరిహారం అందలేదన్నారు. రెండేళ్లలో మళ్లీ కేసీఆర్​ అధికారంలోకి వస్తారని, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు ఓపిక పట్టాలని కార్మికులను కోరారు.

ఇది కూడా చదవండి..: High Court Notices | పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం.. సీవీ ఆనంద్‌కు ధిక్కార నోటీసులు!

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Son Attack Father | మోస్రాలో కలకలం.. తండ్రిపై తనయుడు హత్యాయత్నం..

అక్షరటుడే, బాన్సువాడ: Son Attack Father | తండ్రీకొడుకుల మధ్య ఏర్పడిన...

Disabled Vehicle Distribution | అర్హులైన వికలాంగులందరికీ వాహనాలు అందజేయాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్

అక్షరటుడే, ఇందూరు: Disabled Vehicle Distribution | అర్హులైన వికలాంగులందరికీ ప్రభుత్వం...

Jabalpur Boat Tragedy | ప్రాణం పోతున్నా బిడ్డను వీడలేదు.. జబల్‌పూర్‌లో కంటతడి పెట్టించే విషాదం

అక్షరటుడే, మధ్యప్రదేశ్: Jabalpur Boat Tragedy | మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని...

Child Adoption Rules | పిల్లలను అక్రమంగా దత్తత తీసుకుంటే కఠినచర్యలు: అడిషనల్​ కలెక్టర్​

అక్షరటుడే, ఇందూరు: Child Adoption Rules | పిల్లలను అక్రమంగా దత్తత...