అక్షరటుడే, వెబ్డెస్క్: MP Mithun Reddy | అన్నమయ్య జిల్లా (Annamaya District) పుంగనూరులో జరిగిన దాడిలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి గాయాలు అయ్యాయి. ఆయన సెక్యూరిటీ సిబ్బంది సైతం గాయపడ్డారు. దీనిని ఆయనపై జరిగిన హత్యాయత్నంగా వైఎస్సార్సీపీ పేర్కొంది.
పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడంతో పాటు రాళ్ల దాడి కూడా జరిగింది. టీడీపీ నాయకుడు మధు రాయల్పై ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారని టీడీపీ ఆరోపించింది. ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్పై కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి జరిగిందని, దీనివల్ల ఎంపీతో పాటు పలువురు పార్టీ నాయకులు గాయపడ్డారని వైఎస్సార్సీపీ పేర్కొంది.
MP Mithun Reddy | రాయచోటీలో..
రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆఫీసుపై టీడీపీ కార్యకర్తల దాడి చేశారు. వైసీపీ ఆఫీసుతో పాటు మాజీ ఎమ్మెల్యే వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో 10 వాహనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. స్థానిక ఎన్నికల సమయంలో ఏపీలో దాడులు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇది కూడా చదవండి..: Drug Seizures | గంజాయిపై ఉక్కుపాదం.. భారీగా సరుకు స్వాధీనం