Nizamabad Road Accident | ద్విచక్ర వాహనం అదుపుతప్పి.. మున్సిపల్ కార్మికుడి దుర్మరణం

పులాంగ్ చౌరస్తా వద్ద ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో కిందపడిపోయారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nizamabad Road Accident | నిజామాబాద్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మున్సిపల్ కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద శుక్రవారం Friday రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Nizamabad Road Accident | తీవ్ర గాయాలు

వివరాల్లోకి వెళ్తే.. హనుమాన్ Hanuman నగర్‌కు చెందిన విఠల్ (46) నిజామాబాద్ మున్సిపాలిటీ జోన్–2లో కార్మికుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి పులాంగ్ చౌరస్తా వద్ద ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో కిందపడిపోయారు. ఈ ఘటనలో విఠల్ తీవ్రంగా గాయపడ్డారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

వెంటనే స్పందించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, విఠల్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *