అక్షరటుడే, వెబ్డెస్క్: Car Racing Accident | యువకుల కారు రేసింగ్ సరదా ఓ కుటుంబాన్ని రోడ్డు పడేసింది. అతివేగంగా, నిర్లక్ష్యంగా కార్లు నడుపుతూ.. బైక్ను ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది. ఆమె భర్తకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar District)లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్కు చెందిన షాకీర్, భార్య షహానా బేగం, కూతురు ఆయారాతో కలిసి బైక్పై వెళ్తున్నాడు. అయితే అదే సమయంలో కొందరు యువకులు థార్ కార్లతో రోడ్డుపై రేసింగ్ చేస్తున్నారు. అమిస్తాపూర్ యూపీఎస్ స్కూల్ వద్ద వారి కార్లు ఒకదాని తర్వాత ఒకటి బైక్ను ఢీకొట్టాయి. దీంతో షహానా బేగం తీవ్రంగా గాయపడిన అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త షాకీర్కాళ్లు చేతులు విరగడంతో పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారి ఆయారా స్వల్ప గాయాలతో బయటపడింది.
Car Racing Accident | పట్టుకున్న స్థానికులు
రెండు కార్లు బైక్ను ఢీకొట్టిన తర్వాత వేగంగా దూసుకెళ్లాయి. గమనించిన స్థానికులు వెంబడించి ఒక కారును పట్టుకున్నారు. మరో కారు వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారును అందులోని విద్యార్థులను స్టేషన్ను తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవల కొందరు యువకులు, విద్యార్థులు రోడ్లపై ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్నారు. రేసింగ్లకు పాల్పడుతూ ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. రీల్స్ కోసం కార్లు, బైక్లపై అతివేగంగా దూసుకెళ్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Rain Alert | రైతులకు అలర్ట్.. నేటి నుంచి వర్షాలు