Telangana Water Rights | తెలంగాణ జల హక్కులు ఆంధ్రాకు తాకట్టు పెట్టిన సీఎం : హరీశ్​రావు

సీఎం రేవంత్​రెడ్డి తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రాకు తాకట్టు పెట్టారని హరీశ్​రావు మండిపడ్డారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Water Rights | సీఎం రేవంత్​రెడ్డి తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రాకు తాకట్టు పెట్టి.. రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. తెలంగాణ భవన్​లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఏపీలో లేని క్రాప్ హాలిడే తెలంగాణలో ఎందుకని హరీశ్​రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రైతులు మీ సావు మీరు సావండి అని చేతులెత్తేశారన్నారు. ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు కానీ నీళ్లు కొనలేమని అంటున్నారని, అలాంటి నీళ్ల విషయంలో తాము ముందు నుంచి చెప్తున్నా వినకుండా నీళ్లు ఎందుకు ఒడిసిపట్టలేదన్నారు. నీళ్లు అన్నీ ఏపీకి తరలించి ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఎలా అన్నారు.

Telangana Water Rights | నదుల అనుసంధానం పేరిట

గోదావరి, కావేరి నదుల అనుసంధానం పేరిట చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహం చేసేలా కుట్రకు తెరలేపారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా.. రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి కుట్రలను అడ్డుకున్నామని చెప్పారు. తెలంగాణ మీదుగా సాగాల్సిన నదుల అనుసంధాన ప్రక్రియ ఏపీకి ఎలా మారుస్తారని నిలదీశారు.

Telangana Water Rights | అభ్యంతరాలు వస్తున్నా..

నదుల అనుసంధానం సమ్మక్క బ్యారేజీ నుంచి కాకుండా పోలవరం నుంచి చేపట్టాలని ఈ నెల 7న కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఒక లేఖ రాశారని హరీశ్​ రావు చెప్పారు. ఐదు రోజుల వ్యవధిలోనే కేంద్రం స్పందించిందని హరీశ్ రావు పేర్కొన్నారు. నవంబర్ 3న ఢిల్లీలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. కావేరి అనుసంధానం పేరుతో గోదావరి నది మనుగడనే దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Telangana Road Safety | రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం : మంత్రి పొన్నం ప్రభాకర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *