అక్షరటుడే, కోటగిరి : Potangal Society Rice | సన్నబియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రెండు నెలల వ్యవధిలోనే రూ.1500కు పైగా ధరలు పెగడంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఎల్నినో ఎఫెక్ట్తో ధరలు పెరుగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే పోతంగల్ సొసైటీలో బియ్యం పక్కదారి పడుతోందనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Potangal Society Rice | పోతంగల్ సొసైటీలో..
పోతంగల్ (Potangal) పీఏసీఎస్ సొసైటీ పరిధిలోని బియ్యం దుకాణంలో బియ్యంకు భలే డిమాండ్ ఉంటుంది. ఇక్కడి బియ్యం ఖరీదు చేసి తినేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కాని ఇటీవల సొసైటీ బియ్యం క్షణాల్లోనే మాయమవుతున్నాయి. సాధారణ ప్రజలు బియ్యం అడిగితే సిబ్బంది లేవంటున్నారని.. కాని అవే బియ్యం బయట దుకాణాల్లో దొరుకుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పోతంగల్ సొసైటీకి వచ్చిన బియ్యం వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు.
Potangal Society Rice | భగ్గుమంటున్న ధరలు..
బహిరంగ మార్కెట్లో బియ్యం డీలర్ల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని వారన్నారు. గతంలో హెచ్ఎంటీ బియ్యం రేటు రూ.4,600 ఉంటే ఇపుడు రూ.8,000కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అలాగే
జైశ్రీరామ్ బియ్యం రూ.5,000 ఉండేవని.. రూ.8,000, బీపీటీ రూ.4,400 ఇప్పుడు రూ.6,000 పలుకుతోంది. అయితే సొసైటీ బియ్యంపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. అధిక ధరల విక్రయాలయపై మండలంలోని దుకాణాల్లో తనిఖీలు చేయాలని కోరుతున్నారు.
Potangal Society Rice | అధికారులు స్పందించాలి..
– ముత్యం, పోతంగల్
సొసైటీలో ఈ మధ్య బియ్యం పక్కదారి పడుతున్నట్లుగా తెలుస్తోంది. బియ్యం కొందామని ఎప్పుడు వెళ్లినా లేవు అనే సమాధానం వస్తోంది. అధికారులు సొసైటీలో బియ్యం డీలర్లకు చేరకుండా చర్యలు చేపట్టాలి. సామాన్యులకు అందుబాటులో ఉంచాలి.
ఇది కూడా చదవండి..: ABPS National President | మానవత్వం, సోదరభావంతోనే ఐక్యత : ఏబీపీఎస్ జాతీయ అధ్యక్షుడు ప్రబోధ్ సుమేర్