అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: NHM Employees | ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ (Telangana) ఆయుష్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు న్యావనంది పురుషోత్తం పటేల్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని (Nizamabad) ధర్నాచౌక్లో ధర్నా చేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ఆయన మద్దతు తెలిపారు.
NHM Employees | సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం..
ఈ సందర్భంగా న్యావనంది పురుషోత్తం పటేల్ మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎం ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కరించేంత వరకు తాము వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
ఐఎన్టీయూసీ కాంగ్రెస్ నాయకులు సోమవారం ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు జ్యోత్స్న, అర్వింద్, జయరాజ్, బాబురావు, నటరాజ్, కంచెట్టి రవి, నాయకులు సురేందర్, భిక్షపతి, రమణ, శైలజ, హన్మాండ్లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి?