Panduga Sayanna | ముదిరాజ్​లను ‘బీసీ–ఏ’లోకి మారుస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

ముదిరాజ్​లను బీసీ–డీ నుంచి బీసీ–ఏ లోకి మారుస్తామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Panduga Sayanna | ముదిరాజ్​లకు సామాజిక న్యాయం చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చారు. ముదిరాజ్​లను బీసీ డీ నుంచి బీసీ–ఏలోకి మారుస్తామన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ ప్రక్రియ సాగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పండుగ సాయన్న జయంతి వేడులకను హైదరాబాద్​లోని రవీంద్ర భారతిలో అధికారికంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముదిరాజ్​లను బీసీ–ఏలోకి మార్చే ప్రక్రియను హడావుడిగా చేస్తే కోర్టులు కొట్టేసే అవకాశం ఉందన్నారు. న్యాయ నిపుణులు సంప్రదించి.. దీనిని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తామన్నారు. ముదిరాజ్​ సమస్యలపై తనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. ప్రభుత్వంలో వారిని భాగస్వామ్యం చేస్తామని తెలిపారు.

Panduga Sayanna | పేదలకు పంచారు

మహబూబ్​నగర్​ జిల్లాలో పండుగ సాయన్న పేదలకు అండగా నిలిచారని సీఎం అన్నారు. దొరల గడీలలో పంటలను కొల్లగొట్టి పేదలకు పంచారన్నారు. బంగారం, నిధులను పేదల పెళ్లిళ్లకు ఇచ్చారని కొనియాడారు. ఆయనను అరెస్ట్ చేస్తే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారన్నారు. అయితే పండుగ సాయన్నకు 40 ఏళ్లు నిండకముందే ఉరి తీశారన్నారు. పండుగ సాయన్న విగ్రహాన్ని ట్యాంక్​బండ్​పై ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ముదిరాజ్​ సోదరులు నమ్మకమైన, పౌరుషం ఉన్న వాళ్లన్నారు.

ఇది కూడా చదవండి..: Shamshabad Road Accident | డీసీఎంను ఢీకొన్న బైక్​.. తండ్రి మృతి, కూతురికి తీవ్రగాయాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *