అక్షరటుడే, వెబ్డెస్క్: Treated Water Usage | ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు తాండవం చేస్తోంది. జలాశయాల్లో నీటిమట్టాలు భారీగా పడిపోయాయి. రానున్న రోజుల్లో తాగునీటికి సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ (Hyderabad) నగరంలో జలమండలి అధికారులు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టారు.
నగరంలో తాగునీటి తిప్పలు రాకుండా జలమండలి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నీటిని వృథా చేసే వారికి భారీగా జరిమానా వేస్తోంది. అంతేగాకుండా శుద్ధి చేసిన నీటి వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. ఇప్పటికే కొత్త ఎస్టీపీల నమోదుకు జలమండలి అవకాశం కల్పించింది. తాజాగా కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ఎండీ కె. అశోక్ రెడ్డి పరిశీలించారు. తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు శుద్ధి చేసిన నీటి వినియోగానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
Treated Water Usage | ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
ఫిల్లింగ్ స్టేషన్‌లో శుద్ధి చేసిన నీటి నాణ్యత ప్రమాణాలు, పరీక్షల ఫలితాలను ఎండీ పరిశీలించారు. నీటి నాణ్యత పరీక్షల ఫలితాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ట్యాంకర్లలో నింపే నీటి పరిమాణాన్ని కచ్చితంగా గుర్తించేందుకు ఫిల్లింగ్ మార్కులు ఏర్పాటు చేయాలని సూచించారు. శుద్ధి చేసిన నీటి నాణ్యత, సరఫరా పరిమాణంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈ నీటిని నిర్మాణ రంగం, రోడ్ల శుభ్రత, దుమ్ము నియంత్రణ, ఉద్యానవనాలకు వినియోగించాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Shamshabad Road Accident | డీసీఎంను ఢీకొన్న బైక్.. తండ్రి మృతి, కూతురికి తీవ్రగాయాలు