తెలంగాణRTC Workers Issues | ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

RTC Workers Issues | ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారు. మే డే సందర్భంగా కార్మిక సంఘాల నాయకులతో భేటీ అయ్యారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Workers Issues | ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆయన కార్మిక సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆర్టీసీలోని 14 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సీఎం మాట్లాడుతూ.. ‘‘నేను వేరు, మీరు వేరు అన్న భావ‌న నాకు ఎప్పుడు లేదు.. అంద‌రం క‌లిస్తేనే ప్ర‌భుత్వం” అన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం (Congress Govt) రావాల‌ని ఆర్టీసీ కార్మికులు కోరుకున్నారని చెప్పారు. కార్మికుల పోరాటాల్లో తాము ఉన్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీలో బ‌స్సుల‌ను, నియామ‌కాలు పెంచినట్లు వివరించారు.

RTC Workers Issues | కొత్తగా బస్​ టర్మినళ్లు

ఆర్టీసీ విస్తరణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం అన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని గాజుల‌రామారంలో 100 ఎకరాల్లో బస్​ టర్మినల్ నిర్మిస్తామన్నారు. శంషాబాద్​లో బస్​ టర్మినల్ (Shamshabad Bus Terminal) కోసం 150 కేటాయించినట్లు తెలిపారు. త్వరలో 1000 ఈవీ బ‌స్సులు కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తామన్నారు. మినీ బస్సులు కొనుగోలు చేసి సంస్థకు అందిస్తామని తెలిపారు.

RTC Workers Issues | డీజిల్​ భారం తగ్గించుకోవడానికి..

డీజీల్ పైన ఆర్టీసీ ప్ర‌తి యేడాది రూ.2000 కోట్లు ఖ‌ర్చు చేస్తుందని సీఎం తెలిపారు. డీజీల్ ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌డానికి ఈవీ బ‌స్సుల‌ను తీసుకు వస్తున్నట్లు చెప్పారు. ఆదాయం పెర‌గాలంటే ఖ‌ర్చు త‌గ్గించుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు పేరుకు పోయిన బకాయిలను తాము క్లియర్​ చేస్తున్నామని చెప్పారు. పెండింగ్​లో ఉన్న కారుణ్య నియామకాలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. యూనియన్లు, ఆర్టీసీలో ప్రభుత్వం విలీనం లాంటి అంశాల‌పైన కార్మిక సంఘాలే చ‌ర్చించుకుని నిర్ణ‌యం చెప్పాలన్నారు. ఆర్థిక అంశాల‌తో కూడా పీఆర్సీపైన ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

కార్య‌క్ర‌మంలో ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్, ఎంపీలు వేం న‌రేంద‌ర్ రెడ్డి, అనిల్ కుమార్ యాద‌వ్, స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ వికాస్ రాజ్, సీఎం ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీనివాస‌రాజు, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు మ‌క్క‌న్ సింగ్ ఠాగూర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Kadiyam Srihari Comments | కేసీఆర్ వైఖరి నచ్చకే బయటకు వచ్చా.. కడియం సంచలన వ్యాఖ్యలు!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Government Employee | పీఆర్సీ అమలు చేస్తాం.. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో డిప్యూటీ సీఎం భేటీ!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Government Employee | ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై...

Mother Murder Case | తల్లి ప్రేమను కాలరాసిన కామం.. రూ.45 లక్షల కోసం అమ్మను బలితీసుకున్న కసాయి కూతురు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mother Murder Case | ఏ బంధమైనా కాలక్రమేణా...

Sitaram Suicide Case | భర్త ఆత్మహత్య చేసుకున్న నెల రోజులకే.. ప్రియుడితో పెళ్లి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sitaram Suicide Case | హైదరాబాద్ (Hyderabad)​లో...

Fuel Price Hike | వాహనదారులకు మోత తప్పదా.. పెరగనున్న పెట్రోల్​, డీజిల్ ధరలు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fuel Price Hike | దేశంలో ఇంధన...