TGSPF Formation Day | భద్రతే అభివృద్ధికి పునాది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భద్రతే అభివృద్ధికి పునాది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: TGSPF Formation Day | భద్రతే అభివృద్ధికి పునాది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. అమీన్‌పూర్‌లో జరిగిన టీజీఎస్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సుమారు 2,000 మంది సిబ్బందితో తెలంగాణ వ్యాప్తంగా 67 కీలక సంస్థలను కాపాడటంలో ఈ దళం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

తెలంగాణను సురక్షిత, సమృద్ధ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో TGSPF పాత్ర కీలకమని భట్టి విక్రమార్క అన్నారు. 1991 అక్టోబర్ 23న తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం ఏర్పాటు అయింది. TGSPF అధికారులు, సిబ్బందికి డిప్యూటీ సెం 36వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సంస్థల నిరంతరాయ పనితీరుకు భద్రతా సిబ్బంది సేవలు కీలకమి పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల రక్షణలో TGSPF సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.

TGSPF Formation Day | బలోపేతం చేయాలి

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. సిబ్బందికి శారీరక దృఢత్వంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం అవసరమని చెప్పారు. మారుతున్న సవాళ్లకు అనుగుణంగా నిరంతర శిక్షణ తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో భరోసా కల్పించడమే మంచి భద్రతా వ్యవస్థ లక్ష్యమన్నారు. సిబ్బంది సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి, మెరుగైన పని పరిస్థితులను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Khammam Car Fire | ఖమ్మం కలెక్టరేట్ సమీపంలో కారు దగ్ధం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *