Revanth Reddy Policing Reforms | పోలీసింగ్​ విధానాలు మారాలి : సీఎం రేవంత్​రెడ్డి

మెరుగైన సమాజానికి ప్రజా భద్రతే పునాది అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Policing Reforms | మెరుగైన సమాజానికి ప్రజా భద్రతే పునాది అని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ పోలీస్ సమన్వయ కమిటీ (SRPCC) సమావేశ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.

ప్రజల భద్రత, రక్షణను నిర్ధారించడానికి పటిష్టమైన అంతర్రాష్ట్ర పోలీసు సమన్వయం, సమర్థవంతమైన పోలీసింగ్ అవసరం అన్నారు. మారుతున్న నేరాలను ఎదుర్కోవడానికి పోలీసింగ్​ విధానాలు మారాలన్నారు. సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం, , నక్సల్ రహిత రాష్ట్రం దిశగా పురోగతితో తెలంగాణ ప్రజా భద్రతలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందని అన్నారు. ప్రజా భద్రత అనేది కేవలం శాంతిభద్రతలకు మాత్రమే పరిమితం కాదని, అది ప్రాణాలను, జీవనోపాధులను, ప్రజా ఆస్తులను కాపాడటంతో పాటు సమ్మిళిత పురోగతిని కూడా నిర్ధారిస్తుందని తెలిపారు.

Revanth Reddy Policing Reforms | సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలి

SRPCC సదస్సు హైదరాబాద్‌లో జరుగుతుండటం గర్వకారణం అన్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రాల పోలీసు విభాగాలు, ప్రత్యేక విభాగాల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పోలీసింగ్ విధానాలు మారాలని, సంస్కరణలు నిరంతరం కొనసాగాలని సూచించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్ సమస్యలు అత్యంత కీలకంగా మారాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు.

ఇది కూడా చదవండి..: TGSPF Formation Day | భద్రతే అభివృద్ధికి పునాది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *