అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma houses) నిర్మాణానికి సంబంధించి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
Indiramma Housing Scheme | పేదలకు ఎంతగానో ఉపయోగం..
ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, ఇళ్ల నిర్మాణ పనులను నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు మున్సిపాలిటీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ లలిత చిట్టిబాబు, ఆర్వో గోపాల్ రెడ్డి, రాజ్ కుమార్, వార్డు ఆఫీసర్ వినయ్, దీప్తి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: El Niño Farming Advisory | రైతుకు వరిసాగుకు దూరంగా ఉండాలి