అక్షరటుడే వెబ్‌డెస్క్: Benelli TRK 552 | ప్రముఖ సూపర్‌బైక్ తయారీ సంస్థ ‘బెనెల్లీ ఇండియా’ ( India )తమ ఎంతో ఆదరణ పొందిన అడ్వెంచర్-టూరింగ్ విభాగంలో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రోడ్డు ప్రయాణాల కోసం ‘TRK 552’, ఆఫ్-రోడ్ అడ్వెంచర్ల కోసం ‘TRK 552X’ అనే రెండు వేరియంట్లను భారత మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మోటార్ సైకిళ్లకు సంబంధించిన బుకింగ్‌లు దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత బెనెల్లీ కీవే డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి.
Benelli TRK 552 | ధరల వివరాలు..
రైడర్ల అవసరాలకు అనుగుణంగా బెనెల్లీ వీటి ధరలను నిర్ణయించింది. దీని ప్రకారం TRK 552 ధర రూ. 7,22,000/- కాగా, TRK 552X ధర రూ. 7,74,000/-గా ఉంది. అలాగే TRK 552X లిమిటెడ్ ఎడిషన్ ధరను రూ.7,90,000/-గా నిర్ణయించారు. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్, ఇండియా ప్రాతిపదికన వర్తిస్తాయి.
Benelli TRK 552 | శక్తివంతమైన ఇంజన్..
రెండు బైక్‌లలోనూ 554cc లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 8,500 rpm వద్ద 52 bhp పవర్, 6,500 rpm వద్ద 49 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్పర్ క్లచ్‌ను జతచేశారు. దీనివల్ల వేగంగా గేర్లు మార్చేటప్పుడు బైక్ నియంత్రణ సులువవుతుంది. హైవేలపై ప్రయాణానికి TRK 552 అనువుగా ఉండగా, స్పోక్ వీల్స్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌తో TRK 552X మోడల్ ఆఫ్-రోడింగ్‌కు అనుకూలంగా రూపుదిద్దుకుంది.
Benelli TRK 552 | అధునాతన టెక్నాలజీ..
ఈ బైక్‌ల కాక్‌పిట్‌లో 5-అంగుళాల TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఆఫ్‌లైన్ మ్యాప్స్, T-BOX కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత కోసం టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఇచ్చారు. ఇది టైర్లలో గాలి ఒత్తిడిని పర్యవేక్షిస్తూ ఏవైనా తేడాలు ఉంటే రైడర్‌ను వెంటనే అలర్ట్ చేస్తుంది.
Benelli TRK 552 | రైడింగ్ కంఫర్ట్..
సుదీర్ఘ ప్రయాణాల్లో రైడర్లకు అలసట కలగకుండా హీటెడ్ గ్రిప్స్, హీటెడ్ సీట్లు, అదనపు ప్యాడింగ్తో కూడిన కొత్త డబుల్-థ్రెడెడ్ సీట్లను అందించారు. హ్యాండిల్‌బార్‌ను అనుకూలంగా అడ్జస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. బైక్‌కు 20-లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. బ్రేకింగ్ విషయానికి వస్తే ముందుకు 320mm ట్విన్ డిస్క్‌లు, వెనుక 260mm డిస్క్ బ్రేక్‌తో పాటు బాష్ (Bosch) డ్యూయల్-ఛానల్ ABS భద్రతను అందిస్తుంది.
ఇది కూడా చదవండి: Avocado Benefits | షుగర్ కంట్రోల్ నుంచి కంటిచూపు వరకు.. అవకాడో అద్భుత ప్రయోజనాలు ఇవే..!