అక్షరటుడే, వెబ్డెస్క్ : Sunnam Cheruvu Illegal Borewells | హైదరాబాద్ నగరంలోని మాదాపూర్లో గల సున్నం చెరువులో అక్రమంగా వేసిన బోర్లు, పైప్లైన్లను హైడ్రా అధికారులు శనివారం తొలగించారు. పోలీసు భద్రత నడుమ, రెవెన్యూ, సీఎంసీ అధికారుల సమక్షంలో నిర్వహించిన ఆపరేషన్లో నివాస ప్రాంగణాల్లోని బోర్వెల్లకు అనుసంధానించిన పైపులను తొలగించింది.
హైదరాబాద్ (Hyderabad)లో నీటి ఎద్దడి నెలకొన్న విషయం తెలిసిందే. ఏళ్లుగా మాదాపూర్లోని సున్నం చెరువు కేంద్రంగా కొందరు అక్రమంగా నీటిని తరలిస్తున్నారు. చెరువులో బోర్లు, పైప్లైన్లు వేసి.. ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తున్నారు. దీనిపై గతంలో పలుమార్లు హైడ్రా హెచ్చరించినా.. వ్యాపారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో హైడ్రా శనివారం ఆపరేషన్ చేపట్టింది.
Sunnam Cheruvu Illegal Borewells | నివాసాల్లో నీటి వ్యాపారం
నివాస ప్రాంతాల నుంచి భూగర్భ జలాలను తోడి, విక్రయించడానికి వేసిన అక్రమ బోర్వెల్ పైప్లైన్లను తొలగించేందుకు హైడ్రా ఒక భారీ ఆపరేషన్ను ప్రారంభించింది. ఇంట్లో బోరుబావి, పక్కనే నీళ్ల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సున్నం చెరువు పరిసరాల్లోని కొన్ని నివాసాల్లో అక్రమంగా నీటిని విక్రయిస్తున్నట్లు తెలిపారు. మురుగునీరు, చెత్తాచెదారం మీదుగా వేసిన పైపుల వల్ల తీవ్రమైన కాలుష్య ప్రమాదం ఉందని, చిన్న పగుళ్లు కూడా నీటి సరఫరాను కలుషితం చేయగలవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఆ పైప్లైన్లను ధ్వంసం చేశారు.
ఇది కూడా చదవండి..: TG Safe Raids | పండుగ వేళ స్వీట్లు కొంటున్నారా.. అయితే జాగ్రత్త!