Minor Assault Case | యువతిపై ఇద్దరు మైనర్ల దాడి.. పోలీసులకు అప్పగించిన స్థానికులు

యువతిపై ఇద్దరు మైనర్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటుచేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Minor Assault Case | యువతిపై ఇద్దరు మైనర్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బాన్సువాడ (banswada) పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

Minor Assault Case | డబుల్​ బెడ్​రూం కాలనీ వద్ద..

పట్టణంలోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నివాసం ఉంటున్న ఇద్దరు మైనర్ బాలురు మద్యం సేవించి వస్తున్న క్రమంలో అదే ప్రాంతానికి వెళ్తున్న ఓ యువతిని వెనుక నుంచి అడ్డుకున్నారు. ఒకరు యువతి ముఖాన్ని చేతులతో పట్టుకోగా, మరొకరు ఆమెపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో భయాందోళనకు గురైన యువతి కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకుని ఇద్దరు బాలురను పట్టుకున్నారు. వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. యువతిపై దాడికి గల కారణాలు, ఘటన వెనుక ఇతర ఉద్దేశాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *