Alumni Reunion | ఉత్సాహంగా పదో తరగతి పూర్వవిద్యార్థుల సమ్మేళనం..

పెద్దకొడప్​గల్​ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, పెద్దకొడప్​గల్​: Alumni Reunion | మండల కేంద్రంలోని (Pedda Kodapgal ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999–2000 బ్యాచ్​ పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుమారు 26 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు.

Alumni Reunion | పాఠశాల ప్రాంగణంలో సందడి..

జిల్లా పరిషత్​ పాఠశాలలో చదువుకున్న పాతస్నేహితులు మళ్లీ కలుసుకోవడంతో పాఠశాల ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకున్న రోజుల్లోని అనుభవాలు, ఆటపాటలు, ఉపాధ్యాయులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేస్తూ అప్పటి స్నేహబంధాలను మరోసారి పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. పదో తరగతి అనంతరం వివిధ మార్గాల్లో ముందుకు సాగిన పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఉద్యోగ, వ్యాపార రంగాలతో పాటు వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.

ఇది కూడా చదవండి : స్క్రాప్ షాపులో భారీ పేలుడు.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *