అక్షరటుడే, ఇందూరు: Induru to Sabarimala Yatra | శబరిమలకు పాదయాత్రగా వెళ్లడం అనేది దైవనిర్ణయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ తెలిపారు. ఇందూరు శ్రీధర్మశాస్త్ర పాదయాత్రను సోమవారం నగరంలోని అయ్యప్ప ఆలయంలో ప్రారంభించారు.
Induru to Sabarimala Yatra | యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని..

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహా పాదయాత్రలో పాల్గొంటున్న స్వాములందరికి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. మొత్తం 40 మంది స్వాములు సుమారు 45 రోజులపాటు పాదయాత్రగా శబరిమల చేరుకుంటారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలన్నారు. అయ్యప్ప మాల ఎంతో పవిత్రమైందని, మాలాధారణతో పాదయాత్రగా వెళ్లడమనేది మరింత కఠినమైందన్నారు. కార్యక్రమంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, గుండయ్య గురుస్వామి, ఆగమయ్య గురుస్వామి, పాదయాత్ర స్వాములు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: CM House Protest Arrests | సీఎం ఇంటి ముట్టడికి వెళ్తున్న ఉద్యమకారుల అరెస్ట్