అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police | అపురూపంగా పెంచుకుంటున్న కుక్కపిల్ల అదృశ్యమైందని ఆ బాలుడు తల్లడిల్లిపోయాడు. వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన కామారెడ్డి(Kamareddy) పోలీసులు కుక్కపిల్లను వెతికి తీసుకొచ్చి బాలుడికి అప్పజెప్పారు.
Kamareddy Police | కామారెడ్డి పట్టణంలో..
పట్టణంలోని ఇస్లాంపురా కాలనీకి చెందిన 17 ఏళ్ల మణికంఠ గౌడ్ పెంచుకుంటున్న నల్ల కుక్కపిల్ల మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం 2:30 సమయంలో ఓ మహిళ స్కూటీపై వచ్చి తీసుకెళ్లిందని చూసిన వాళ్ళు చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎన్ఆర్ ప్యాలెస్ దగ్గర షాప్ ముందు నుంచి తీసుకెళ్లారని, కుక్కపిల్లను తీసుకెళ్లిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు సీసీ కేమెరాల ఆధారంగా కుక్కపిల్లను తీసుకువచ్చి బాలుడికి అప్పగించారు. దీంతో బాలుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో పోలీసులకు అతడు కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఇది కూడా చదవండి: మహానంది ఆలయం సమీపంలో..నాన్ వెజ్ వంటకాలు తయారు