అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Firecracker Shops | దీపావళి సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక పటాకుల దుకాణాలు నెలకొల్పేవారు అనుమతులు తీసుకోవాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.
Firecracker Shops | డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయంలో..
పటాకుల దుకాణాలు నిర్వహించాలనుకునే వారు డివిజినల్ పోలీస్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని సీపీ తెలిపారు. దీనికి సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజినల్ స్థాయి అధికారిని సంప్రదించాలన్నారు. అనుమతి లేకుండా దుకాణాలు నెలకొల్పితే వారిపై ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్-1884, రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారంగా కఠినచర్యలు తీసుకుంటామన్నారు.
Firecracker Shops | నిబంధనలు పాటించాలి
పటాకుల దుకాణాలను ఖాళీ ప్రదేశాల్లోనే నెలకొల్పాలని సీపీ సూచించారు. ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్వోసీ సర్టిఫికెట్ పొందుపర్చాలన్నారు. ఒక క్లస్టర్లో 50 షాపులకు మించరాదని..అలాగే రద్దీగల ప్రదేశాలలో ఎలాంటి పటాకుల షాపులు ఏర్పాటు చేయరాదన్నారు. అదేవిధంగా కళ్యాణ మండపాల్లో, సమావేశాల కేంద్రాలలో దుకాణాలు పెట్టవద్దని పేర్కొన్నారు. తాత్కాలిక పటాకుల దుకాణాలలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన జాగ్రత్తలు తప్పక పాటించేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Manjeera River Deaths | మంజీరాలో గల్లంతైన తల్లీకూతుళ్లు మృతి..