తెలంగాణDefamation Case MLA | ఎమ్మెల్యేపై పరువునష్టం దావా కేసు..

Defamation Case MLA | ఎమ్మెల్యేపై పరువునష్టం దావా కేసు..

మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే కేవీఆర్​ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వ్యక్తిగత ఆరోపణల అంశంలో ఎమ్మెల్యేకు కోర్టు నోటీసులు జారీ చేసేవరకు వెళ్లింది.

అక్షరటుడే, కామారెడ్డి: Defamation Case MLA | కామారెడ్డి రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali), ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipally Venkata Ramana Reddy) మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వ్యక్తిగత ఆరోపణల అంశం ఇప్పుడు ఎమ్మెల్యేకు కోర్టు నోటీసులు జారీ చేసేవరకు వెళ్లింది.

Defamation Case MLA | రేప్​ కేసు ఆరోపణలపై దావా..

గత ఫిబ్రవరి 17న షబ్బీర్ అలీ తనయుడు ఇలియాస్​పై ఎమ్మెల్యే చేసిన రేప్ కేసు ఆరోపణలు దుమారం రేపాయి. తాజాగా ఈ ఆరోపణలపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. శనివారం కామారెడ్డి (kamareddy) పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్ హౌస్​లో సంబంధిత కేసు వివరాలను హైకోర్టు (High Court) న్యాయవాది సుమంత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి షబ్బీర్ అలీ కొడుకు ఇలియాస్​పై రేప్ కేసు బయటకు తీస్తా అంటూ ఫిబ్రవరి 17, 21న మాట్లాడారని తెలిపారు. అవాస్తవాలు, అసత్య ప్రచారం చేశారని ఇలియాస్ తన పరువుకు (defamation case) భంగం కలిగించారని, కనీసం తనపై పిటీ కేసు కూడా లేదని ఎమ్మెల్యేపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో క్రిమినల్ డిఫర్మేషన్ కేసు వేశారన్నారు.

Defamation Case MLA | 20న కోర్టుకు హాజరుకావాలని..

ఫిబ్రవరి 25 నుంచి లీగల్ ప్రాసెస్ మొదలైందని, 28న కోర్టులో కేసు దాఖలు చేయడం జరిగిందని న్యాయవాదులు పేర్కొన్నారు. దాంతో కోర్టు ఆధారాలను పరిశీలించి ఈ నెల 20న కోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసిందని తెలిపారు. ఒకసారి ప్రజాప్రతినిధుల కోర్టు నోటీసు జారీ చేసిన తర్వాత ఎవరైనా కోర్టుకు హాజరు కావాల్సిందేనన్నారు. ఎమ్మెల్యే వద్ద ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసు ఫైల్స్ ఉంటే కోర్టులో సమర్పించవచ్చన్నారు. సంబంధిత వ్యాఖ్యలకు సంబంధించిన లింక్స్ మీడియా నుంచి డిలీట్ చేశారని, అయితే ఎమ్మెల్యే ఫేస్ బుక్ లైవ్​లో ఇంకా ఉన్నాయని తెలిపారు. సమావేశంలో న్యాయవాదులు గంగారాం, సతీష్, రాజు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: liquor price hike | మద్యంప్రియులకు షాకింగ్​ న్యూస్​.. త్వరలో పెరగనున్న ధరలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 Attack with Helmet | హెల్మెట్​తో కొట్టిన అల్లుడు.. బైక్​పై నుంచి పడి మహిళ మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Attack with Helmet | బైక్​పై వెళ్తుండగా వెనుక...

Gold Loans | గోల్డ్ లోన్లకు భారీ డిమాండ్.. రెండేళ్లలో ఐదు రెట్లు పెరుగుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Loans | దేశంలో బంగారం తనఖా పెట్టి...

Amazon Summer Sale | సమ్మర్ సేల్ కు అమెజాన్ రెడీ.. మే 8 నుంచే గ్రేట్ సమ్మర్ సేల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amazon Summer Sale | అమెజాన్ (Amazon)...

Flipkart Sale | ఫ్లిప్‌కార్టులో ఆఫర్ల జాతర.. 9 నుంచి సాసా లేలే సేల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Flipkart Sale | షాపింగ్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్...