అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Transgender Awareness | ట్రాన్స్జెండర్లు ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం పేర్కొన్నారు. నగరం (Nizamabad)లోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం జిల్లాలోని ట్రాన్స్జెండర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Transgender Awareness | న్యూసెన్స్ చేయవద్దు..

శ్రీశైలం మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా, న్యూసెన్స్‌కు పాల్పడకుండా శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించేందుకు హక్కు ఉందని.. ఆ హక్కును కాపాడుకోవాలన్నారు. చట్టవిరుద్ధమైన చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న వ్యక్తిగత, సామాజిక సమస్యలను తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత మార్గాల్లో సహాయం పొందాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా చట్టాన్ని ఆశ్రయించాలన్నారు. ట్రాన్స్జెండర్లకు ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 14427ను సంప్రదించాలని సూచించారు. సీసీఎస్ సీఐలు సురేష్, అజయ్, సాయినాథ్, ఎస్సైలు మహేష్, భీమ్రావు, మహిళ ఆర్ఎస్సై స్రవంతి, సఖీ సెంటర్ ఇన్‌ఛార్జి భానుప్రియ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Bodhan Market Committee | బోధన్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నాగేశ్వర రావు ప్రమాణస్వీకారం