Drug Awareness | డ్రగ్స్​తో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

డ్రగ్స్ వాడకంతో కలిగే అనర్థాలు, ఇబ్బందులపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Drug Awareness | డ్రగ్స్ వాడకంతో కలిగే అనర్థాలు, ఇబ్బందులపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఎస్పీ మహేష్​ బి గితె తో కలిసి కలెక్టరేట్​లో సమావేశం నిర్వహించారు.

Drug Awareness | గంజాయి సాగు నివారణకు చర్యలు

జిల్లాలో నమోదవుతున్న ఎన్​డీపీఎస్​ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదకద్రవ్యాల నియంత్రణ చర్యలపై కలెక్టర్​ (Collector Garima Agrawal) సమీక్షించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై చేయాల్సిన విస్తృత ప్రచారం, డీ అడిక్షన్ కేంద్రంలో వైద్య సేవలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని  సూచించారు. అటవీ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

Drug Awareness | ప్రభుత్వ, ప్రైవేట్​ కళాశాలల్లో..

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డ్రగ్స్ వాడకంతో కలిగే అనర్ధాలు, ఇబ్బందులపై క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్​ వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖ, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 10 డిగ్రీ కళాశాలలు, 20 జూనియర్ కళాశాలల్లో దాదాపు 2,600 మంది విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలిపారు. జిల్లాలోని పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులను సభ్యులుగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రార్ధన సమయాల్లో డ్రగ్స్ వాడకంతో కలిగే అనర్ధాలపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. సమావేశంలో ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కేఎస్​బీ కుమారి, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా విద్యాధికారి విజయ్ సాగర్, ఇంటర్ విద్యాధికారి శరత్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, జిల్లా ఎక్సైజ్ అధికారి హిమశ్రీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: KTR | రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన : కేటీఆర్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *