అక్షరటుడే, కామారెడ్డి : Municipality Protest | కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీలో అవినీతికి అంతులేకుండా పోతోందని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని నిర్మూలించాలని, పట్టణంలో సమస్యలను పరిష్కరించాలని బల్దియా ఎదుట బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు ధర్నా నిర్వహించారు.
Municipality Protest | ప్రతిశాఖలో అవినీతే..
బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ ప్రతి శాఖలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం లేదని, నీటి సరఫరా కుంటుపడిందన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా కామారెడ్డి పెద్ద చెరువు వద్ద వీధి దీపాలు ఏర్పాటు చేయకపోవడం మున్సిపల్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మున్సిపాలిటీలో డబ్బులు ఇస్తే తప్ప పనులు జరగడం లేదని విమర్శించారు. పట్టణ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కలెక్టర్ చొరవ తీసుకుని మున్సిపల్ కమిషనర్ ను, అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించారు. కామారెడ్డి తహశీల్దార్ హిమబిందు ధర్నా వద్దకు చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.
ఇది కూడా చదవండి..: Rice Shortage | బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి