Temple Dispute | దళితులు వర్సెస్ వీడీసీ.. ఆలయ నిర్మాణంపై కొనసాగుతున్న సందిగ్ధత

దళితులకు సంబంధించిన ఆలయ నిర్మాణంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Temple Dispute | దళితులకు సంబంధించిన ఆలయ నిర్మాణంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. వీడీసీపై దళితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది.

Temple Dispute | రామారెడ్డి మండలం ఉప్పలవాయి..

రామారెడ్డి మండలం (Rama Reddy Mandal) ఉప్పలవాయి గ్రామంలో ఆలయాలను ఒకేచోట నిర్మించాలని చేసిన తీర్మానాన్ని వీడీసీ పెద్దలు విస్మరించి దళితులపై కులవివక్ష చూపుతున్నారని మాల సామాజిక వర్గం ఆరోపిస్తోంది. బుధవారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన దళితులు గురువారం మరోసారి పోలీసులను కలిశారు. అయినా వీడీసీ సభ్యులు ఆలయ నిర్మాణానికి ససేమిరా అంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మరోసారి తమ బాధను మీడియాతో చెప్పుకున్నారు. 2023లో గ్రామంలో ఏ పండుగైనా, పెళ్లి అయినా ఒకేచోట ఆలయాలు ఉంటే ప్రజలందరికీ దూరభారం తగ్గుతుందని 8 ఆలయాలను ఒకేచోట నిర్మించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు.

Temple Dispute | అరిష్టమని అడ్డుకుంటున్నారు..

అయితే కొత్తగా ఎన్నికైన వీడీసీ సభ్యుల్లో కొందరు దళితులకు సంబంధించిన మాల పోచమ్మ ఆలయాన్ని మిగతా ఆలయాలతో పాటు నిర్మిస్తే గ్రామానికి అరిష్టమంటూ కొత్త రాగం ఎత్తుకున్నారని ఆరోపించారు. కొందరు గ్రామస్తులకు మద్యం ఎరగా చూపి దళితులకు వ్యతిరేకంగా మాట్లాడేలా చేస్తున్నారని ఆరోపించారు. ఊరికి దూరంగానే దళితులు ఉండాలని, తమ ఆలయాలకు దూరంగానే దళితులకు సంబంధించిన ఆలయం ఉండాలని చెప్పడం తమపై వివక్ష చూపడమేనన్నారు. పోలీసు వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, తమకు న్యాయం చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Municipality BRS | చైర్మన్ భర్త పెత్తనాన్ని సహించేది లేదు.. బీఆర్ఎస్ కౌన్సిలర్ల అల్టిమేటం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *