అక్షరటుడే, వెబ్డెస్క్ : Cooking Oil Price Rise | పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో గ్యాస్ ధరలు (Gas Prices) భారీగా పెరిగాయి. త్వరలో ఇంధన ధరలు పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. మరోవైపు వంట నూనెల ధరలు (Cooking Oil Prices) సైతం భారీగా పెరిగాయి.
దేశంలో ఇప్పటికే ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. అనేక వస్తువుల ధరలు పెరిగాయి. తాజాగా ఆ జాబితాలోకి వంటనూనె సైతం చేరింది. యుద్ధం ప్రభావంతో వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. యుద్ధం పేరు చెప్పి కొందరు వ్యాపారులు వంట నూనె కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అనంతరం ధరలు పెంచి విక్రయిస్తున్నారు. నెల రోజుల్లోనే కిలో నూనె ధర ఏకంగా 22 శాతం పెరగడం గమనార్హం.
Cooking Oil Price Rise | తీవ్ర ప్రభావం
ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల (Gas cylinders) ధరలు పెరిగాయి. మరోవైపు పప్పులు, కూరగాయల రేట్లు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో వంటింట్లో బడ్జెట్ తారుమారు అవుతోంది. ఈ క్రమంలో వంట నూనె ధరలు సైతం పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడనుంది. మరోవైపు హోటళ్లు, హాస్టళ్లలో కూడా దీని ప్రభావం ఉండనుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంతో ఇప్పటికే పలు హోటళ్లలో రేట్లు పెంచారు. వంట నూనె ధరలకు రెక్కలు రావడంతో హోటళ్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు.
Cooking Oil Price Rise | పెరిగిన రేట్లు ఇలా..
సన్ ఫ్లవర్ ఆయిల్ కిలో ధర రూ. 180 నుంచి రూ.200కు పెరిగింది. పామాయిల్ ధర రూ. 120 ఉండగా.. ఇప్పుడు రూ.145కు విక్రయిస్తున్నారు. వేరుశనగ నూనె రూ. 15 పెరిగింది. 5 కిలోల వేరుశనగ నూనె డబ్బా రూ. వెయ్యి నుంచి రూ. 1150కు చేరింది. 15 కిలోల టిన్ను(హోల్‍సేల్) రూ.2300 నుంచి రూ.2400 వరకు పెరిగింది.
ఇది కూడా చదవండి..: TMC Setback | మమత బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

