అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bear cubs killed by train | రాష్ట్రంలో వరుస వన్యప్రాణుల మరణాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రైలు Train ప్రమాదంలో రెండు ఎలుగుబంటి పిల్లలు మృతి చెందాయి. ఈ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.
Bear cubs killed by train | అసలేం జరిగిందంటే..
అనంతపురం జిల్లా డి. హీరేహాళ్ మండలం కళ్యం గ్రామ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతం గుండా వెళ్లే రైల్వే ట్రాక్‌పై వన్యప్రాణులు సంచరిస్తున్న సమయంలో రైలు ఢీకొనడంతో రెండు ఎలుగుబంటి పిల్లలు ప్రాణాలు కోల్పోయాయి.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యవరస సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Bear cubs killed by train | పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రైల్వే మార్గాల్లో వన్యప్రాణుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రెండు శాఖలు సంయుక్తంగా సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
స్థానిక రైల్వే ఉన్నతాధికారులు, అటవీ శాఖ అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి, ప్రమాదాల నివారణకు వెంటనే ఒక పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
Cyclone Arnab Alert | ‘అర్నబ్’ తుఫాన్ అలర్ట్.. 32 వేల మంది సిబ్బందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
Bear cubs killed by train | లోకో పైలెట్లకు సూచనలు
గతంలో ఇదే రైల్వే మార్గంలో రైలు ఢీకొని చిరుత పులి కూడా మృతి చెందిన ఘటనను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అటవీ మార్గాల్లో రైళ్లు నడిపే లోకో పైలెట్లు మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రైళ్ల వేగాన్ని నియంత్రించడం, అవసరమైన చోట్ల క్రమం తప్పకుండా హారన్ మోగించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి అన్నారు.
అటవీ మార్గాల్లో విధులు నిర్వహించే లోకో పైలెట్లకు వన్యప్రాణుల సంరక్షణ, ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రైల్వే శాఖను కోరారు.
ట్రాక్‌లను తరచూ దాటే వన్యప్రాణుల ప్రాంతాలను గుర్తించి అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన పవన్ కళ్యాణ్.. ఈ సమస్యను సంబంధిత రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాలని పీసీసీఎఫ్‌కు సూచించారు.
Bear cubs killed by train | విద్యుదాఘాతంపై ప్రత్యేక దృష్టి
విద్యుత్ తీగలు తగలడం వల్ల వరుసగా జరుగుతున్న ఏనుగుల మరణాల పట్ల కూడా ఉప ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాల్లో కలెక్టర్లు, విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి శాశ్వత పరిష్కారాలు కనుగొనాలని ఆదేశించారు.
అడవుల సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తగిన ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, పంటల రక్షణ కోసం రైతులు ఎవరూ అక్రమంగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయకుండా విస్తృతంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.
ప్రతి వన్యప్రాణి మరణంపై సమగ్ర దర్యాప్తు జరిపి, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కఠిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆయన హెచ్చరించారు.