HYDRAA Demolitions | రామంతాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్​ నగరంలోని రామాంతాపూర్​లో శనివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: HYDRAA Demolitions | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని రామాంతాపూర్​లో శనివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. చెరువు ఎఫ్​టీఎల్​ పరిధిలో ఉన్న ఓ ఇంటిని అధికారులు కూల్చివేశారు.

బాధితుడు మాట్లాడుతూ.. కోర్టు స్టేటస్ కో ఆర్డర్లను లెక్కచేయకుండా కూల్చివేతలు చేపడుతున్నారని వాపోయాడు. 1974లో తన తల్లి అక్కడ ప్లాట్​ కొనుగోలు చేశారని, 1980లో ఇల్లు కట్టుకున్నామని చెప్పారు. 50 ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్, మున్సిపల్ బిల్లులు అన్నీ కడుతున్నామని తెలిపారు. అయినా కూడా ఎలాంటి నోటీస్​ ఇవ్వకుండా, ఎఫ్​టీఎల్​ పరిధిలో ఉందని తమ నిర్మాణాన్ని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

HYDRAA Demolitions | కోర్టు చెప్పినా..

హైడ్రా అధికారులు ఇటీవల కొలతలు తీసుకోవడంతో.. అనుమానం వచ్చి తాము కోర్టును ఆశ్రయించామని బాధితుడు తెలిపారు. దీంతో ముందుగా ఎఫ్​టీఎల్​ హద్దులు నిర్ణయించిన తర్వాత కూల్చివేతలు చేపట్టాలని కోర్టు ఆదేశించిందన్నారు. అయినా పట్టించుకోకుండా తమ ఇంటిని కూల్చివేశారన్నారు.

ఇది కూడా చదవండి..: Engineering Students Death | పోలీసులను చూసి భయంతో పరుగు.. కరెంట్​ షాక్​తో విద్యార్థుల మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *