Police Retirement | ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సహజమే : సీపీ సాయి చైతన్య

పదవి విరమణ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి సహజమేనని సీపీ సాయి చైతన్య అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Police Retirement | పదవి విరమణ అనేది ప్రతి ఒక్క ఉద్యోగికి సహజమేనని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) అన్నారు. పోలీస్ శాఖ నుంచి ఉద్యోగ విరమణ చేస్తున్న పలువురిని సిపి కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

Police Retirement | అండగా ఉంటాం

సీపీ మాట్లాడుతూ.. ఎటువంటి రిమార్క్ లేకుండా సుదీర్ఘ కాలం సేవలందించి పదవీ విరమణ పొందడం అభినందనీయమన్నారు. డిపార్ట్‌మెంట్ తరపున ఎల్లవేళలా సహకారం ఉంటుందని, పదవీ విరమణ అనంతరం తమ కుటుంబాలతో ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. ​సత్కారం పొందిన వారిలో ​టి. శ్రీనివాస్ గౌడ్ (ఏఎస్సై , టౌన్-5 పీఎస్),​ శీలంపల్లి వెంకటేశ్వర్ (ఏఎస్సై, నవీపేట్ పీఎస్), అబ్దుల్ హమీద్ ఖాన్ (ఏఎస్సై , టౌన్-3 పీఎస్), ​నీలి శేఖర్ (హెడ్ కానిస్టేబుల్, కంట్రోల్ రూమ్) ఉన్నారు.  ​ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, జగతి, వనమాల, ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్ మల్లేష్, ఆర్‌ఐలు ధరణి కుమార్, శేఖర్ బాబు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Police Exam Study Material | పోలీసు ఉద్యోగార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్​ పంపిణీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *