Rajasthan Student Insurance | కేవలం రూ.100 లకే రూ.14 లక్షల బీమా .. విద్యార్థుల కోసం ప్రభుత్వం సంచలన నిర్ణయం

రాజస్థాన్‌లోని కళాశాల విద్యార్థుల భద్రతే లక్ష్యంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Rajasthan Student Insurance | రాజస్థాన్‌లోని కళాశాల విద్యార్థుల  ( Student )భద్రతే లక్ష్యంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక ‘సబ్‌కో బీమా అభియాన్-2047’ మిషన్‌లో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పించాలని కాలేజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలు జారీ చేసింది. 2047 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికి జీవిత, ఆరోగ్య, సాధారణ బీమా సదుపాయం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

Rajasthan Student Insurance | రాజస్థాన్ యూనివర్సిటీ..

ఈ ఇన్సూరెన్స్ పథకం అమలులో రాజస్థాన్ యూనివర్సిటీ ఆదర్శంగా నిలిచింది. యూనివర్సిటీతో పాటు దాని అనుబంధ కళాశాలల్లో చదువుతున్న 24,900 మంది విద్యార్థులకు కేవలం రూ.100 వార్షిక ప్రీమియంతో రూ.14 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీని అందిస్తోంది. రాజస్థాన్ యూనివర్సిటీ విజయం సాధించిన ఈ ఇన్సూరెన్స్ మోడల్‌నే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీల్లో అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

Rajasthan Student Insurance | అడ్మిషన్ ఫీజుతో పాటే ..

ఈ ఇన్సూరెన్స్ ప్రక్రియ విద్యార్థులకు సులభంగా పూర్తి కావడానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కళాశాల ప్రిన్సిపాళ్లు అడ్మిషన్ ఫీజుతో పాటే ఈ రూ.100 ప్రీమియంను సేకరించి, సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీలతో సమన్వయం చేసుకోవాలని జిల్లా స్థాయి ఇన్సూరెన్స్ కమిటీ మెంబర్ సెక్రటరీ సరిత వెల్లడించారు. కేవలం వంద రూపాయలకే రూ.14 లక్షల ధీమా లభించడం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే జైపూర్‌లోని 5 విద్యాసంస్థలకు చెందిన 5,364 మంది విద్యార్థులకు ‘యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ’ ద్వారా కవరేజ్ అందించారు.

Rajasthan Student Insurance | ప్రతి ఒక్కరికీ బీమా కవరేజ్..

ప్రస్తుతం రాజస్థాన్‌లో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు లీడ్ ఇన్సూరర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. విద్యార్థులకే కాకుండా, అల్వార్ జిల్లాలోని దేసులా గ్రామంలో ఉన్న ప్రతి నివాసికి ఇప్పటికే ఇన్సూరెన్స్ కల్పించారు. త్వరలోనే ఈ మోడల్‌ను రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి విస్తరింపజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రతను కోరి రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి:  El Nino Water Conservation | ఎల్​నినో నేపథ్యంలో నీటి పొదుపును పాటించాలి: ఎంపీ అర్వింద్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *