అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad DCSO Suspension | నిజామాబాద్ జిల్లా (Nizamabad) పౌర సరఫరాల శాఖ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సివిల్ సప్లయ్స్ శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.
Nizamabad DCSO Suspension | రైస్ మిల్లుల తనిఖీల్లో నిర్లక్ష్యం కారణంగానే..
జిల్లాలో సీఎంఆర్ దోపిడీ విచ్చలవిడిగా సాగింది. రూ.వేల కోట్లల్లో సీఎంఆర్‌ను మింగేసిన రైస్‌మిల్లర్ల బాగోతాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా సృష్టించాయి. అయితే రైస్‌మిల్లులలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించడంపై సివిల్ సప్లయ్స్ శాఖ ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు.
నిజామాబాద్ డీసీఎస్వో శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్లక్ష్యం వహించిన ఏ అధికారినైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా సివిల్ సప్లయ్స్ శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. జిల్లా పౌరఫరాల శాఖ అధికారి సస్పెన్షన్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి: తాగిన మైకంలో సొంత ఇంటికే నిప్పు.. సిలిండర్ పేలుడుతో ఫైర్ ఆఫీసర్‌కు గాయాలు!