Nizamabad Collectorate | కలెక్టరేట్​లో మహిళ ఆత్మహత్యాయత్నం.. ఇల్లు కబ్జా చేశారనే బాధతో అఘాయిత్యం

కలెక్టరేట్ ​లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Collectorate | కలెక్టరేట్ (Nizamabad)​లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తన ఇల్లును సొంతవారే కబ్జా చేయడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Nizamabad Collectorate | తండ్రి ఇచ్చిన ఆస్తిని..

రూరల్​ పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. హమాల్​వాడీలో ఉండే విజయ అనే మహిళకు ఒక చెల్లెలు ఉంది. ఇటీవలే వారి తండ్రి మరణించాడు. అయితే ఆయన గతంలోనే అక్కాచెల్లెలికి ఇంట్లో చెరో గదిని రాసిచ్చారు. కాని తండ్రి మరణించిన అనంతరం చెల్లెలు అక్క విజయను గెంటేసి ఇల్లు కబ్జా చేసుకుంది. దీంతో దిక్కతోచని విజయ కలెక్టరేట్​ను ఆశ్రయించింది. ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. కాని సమస్య పరిష్కారం అవుతుందో లేదోననే భయంతో విజయ మనమరాలు సరిత పురుగుల మంది తాగేందుకు యత్నించింది.  గమనించిన పోలీసులు వెంటనే ఆమె దగ్గరి నుంచి పురుగుల మందు లాక్కున్నారు. విజయను, ఆమె మనమరాలు సరితను పోలీసులు విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: BPT Rice Price | బీపీటీ బియ్యం ధర కిలో రూ.66కే విక్రయించాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *