అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rapthadu Incident | రాప్తాడు ఘటనపై ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న విద్యార్థినిని ఆయన సోమవారం పరామర్శించారు.
అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి బాలికపై హేమంత్ అనే వ్యక్తి రంపంతో దాడి చేసిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను వైఎస్ జగన్ పరామర్శించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. బాధితురాలి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.
Rapthadu Incident | బెల్ట్ షాప్‌లతో..
రెడ్‌బుక్ రాజ్యాంగం వల్లే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని జగన్ ఆరోపించారు. ప్రతీ వీధికి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, గంజాయి తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి కారణం బెల్ట్ షాపులు, గంజాయి సరఫరా అని విమర్శించారు. బాధితురాలి కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే తాము అధికారంలోకి వచ్చాక ఇస్తామన్నారు. బాలిక పరిస్థితి మెరుగుపడుతోందని ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి..: Rapthadu Attack Case | రాప్తాడు నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం