అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Traffic-Free City | హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రమైన, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదన్నారు.
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మున్సిపల్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకురావడానికి అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాల రాకపోకలు నిరంతరాయంగా కొనసాగేలా చూడాలన్నారు. అలాగే నగరంలో నిత్యం ఇంటింటికీ చెత్త సేకరణ చేపట్టాలన్నారు. ఈ విషయం నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Traffic-Free City | శుద్ధి చేసిన నీటిని వాడాలి
నగరంలో నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, ల్యాండ్ స్కేపింగ్, గార్డెనింగ్ తదితర పనులకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ఈ మేరకు గ్రీన్ వాటర్ ట్యాంకర్లను సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయా పనులకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించడం ద్వారా తాగునీటిని ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో గ్రీన్ వాటర్ సరఫరాను మరింత విస్తరించాలన్నారు.
దీనిని కూడా చదవండి : Indian Stock Market Rally | రిలయన్స్ 11 శాతం అప్.. భారీ లాభాలతో ముగిసిన ప్రధాన సూచీలు