అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Illegal Water Business | హైదరాబాద్ (Hyderabad) నగరంలో అక్రమ నీటిదందాపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అనుమతులు లేకుండా బోర్లు వేసి, ట్యాంకర్ల ద్వారా నీటిని విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపడుతోంది.
నగరంలో భూగర్భ జలాలు కాపాడటం కోసం అక్రమంగా వేసిన బోర్లను హైడ్రా (Hydraa) పూడ్చివేస్తోంది. ఇటీవల సున్నం చెరువు, తుమ్మిడికుంటలో బోర్లు ధ్వంసం చేసిన హైడ్రా తాజాగా.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ గ్రామంలో తనిఖీలు చేపట్టింది. 7 బోర్లను పైపులతో సహా తొలగించి పూడ్చింది. అలాగే 6 వాటర్ సంపులను ధ్వంసం చేసింది. వాటర్ ట్యాంకులను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేయించింది. తెల్లాపూర్‌లో పలువురు అక్రమంగా బోర్లు వేసి, వాటిని ట్యాంకర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో హైడ్రా చర్యలు చేపట్టింది.
దీనిని కూడాచదవండి : Mallareddy Farmhouse | మాజీ మంత్రి మల్లారెడ్డి ఫామ్‌హౌస్ ప్రహరీ కూల్చివేత