అక్షరటుడే, కామారెడ్డి: Welfare Schemes | ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేరడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali) అన్నారు. జిల్లా కేంద్రంలోని (Kamareddy) కళాభారతి ఆడిటోరియంలో శనివారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
Welfare Schemes | అధికారులు బాధ్యతతో వ్యవహరించాలి
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తోందని తెలిపారు. ప్రతి అధికారి ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించి, వారి ఫిర్యాదులను ఆలస్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు కేవలం కాగితాలపైనే కాకుండా, అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమన్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో మరింత సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రజల సహకారం, అధికారుల కృషి కలిసివస్తేనే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), ఆర్డీవో గిరి, మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు లక్ష్మి, రాజు, నియోజకవర్గ సర్పంచులు, జిల్లా అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Welfare Schemes | ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం
భిక్కనూరు (Bhiknoor) మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహ (Indiramma house) ప్రవేశం కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు దుస్తులు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేనివారికి గౌరవప్రదమైన నివాసాన్ని అందించడమే తమ సంకల్పమన్నారు.
అనంతరం గ్రామానికి చెందిన పలువురు నాయకులు షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో భిక్కనూరు సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజు, గ్రామ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Eatala Rajender comments | రాజకీయాల్లో తోసుకుంటూ పోవాల్సిందే..: ఎంపీ ఈటల

